భారత దేశానికి స్వాతంత్రం వచ్చి 75సం” అయిన కానీ భారత దేశంలో నిరుద్యోగ సమస్య మరియు మంచినీటి సమస్యలు కొనసాగుతూన్నాయి కానీ సమస్యలు సమస్యలు గానే మిగిలిపోయినవి. ప్రధాన మంత్రి గా ఎవరు వున్నా కంపనీలకు కొమ్ము కాస్తున్నారు కారణం పదవిపై కాంచ తో ప్రజల సొమ్మును కంపనీలకు దారదత్తం చేస్తూ దారదత్తం చేసిన సొమ్మును కంపనీలు ఈ పార్టీల అది నాయకుల జోబిలోకి వచ్చి చేరరుతున్నాయి. ఆ డబ్బులతో ఎలెక్షన్ లో ఓటర్లకు డబ్బు పంచి ఎలెక్షన్ లో గెలవగల్గుతున్నారు. కానీ సామాన్య ప్రజలకు సేవ చేయాలన్న ఆలోచన కల్గిన ఈ పార్టీలు అక్రమంగా సంపాదించిన డబ్బు ముందర నిలువలేకపోతున్నాయి. 75సం నుండి రాజకీయ పార్టీలను నాయకులను చూస్తే 75%నాయకుల ఆ కుటుంబం నుంచి వచ్చినవారే మిగిలిన 25%కొత్త నాయకులు వచ్చిన ఆ కుటుంబం దగ్గర వారి అనుచరులు గా మారి,వారు చెపినట్లు నడుచు కొనుచున్నారు. ఒక వేల వారి అనుచరులు గా మార నట్లైతే వచ్చే ఎన్నికల్లో వారికీ టికెట్లు రావు ఒక వేల వారు ఇండిపెండెంట్ గా పోటీ చేస్తే వారికి డిపాజిట్లు రావు.కావున ఇప్పుడున్న పార్టీలు ఒకరు పాలక వర్గాముగా మరిఒకరు ప్రతిపక్షముగా కొనసాగుచున్నారు. ఒకరి మీద ఒకరు విమర్శించడం తప్ప చర్యలు తీసుకొవడం జరగలేదు. ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే రెండు కుటుంబాలు 30సం నుండి కొనసాగుచున్నారు. రెండు కుటుంబాలు ఒకరి మీద ఒకరు విమర్శలు తప్ప ఎవరి మీద చర్యలు తీసుకోలేదు. వారు చేసే ప్రతి చర్య ప్రజలు తెలుసుకున్న, కానీ ఏమీచేయలేని నిసహాయ స్థితి లో కొనసాగుచున్నారు.ఈ రాష్ట్రంలో రెండుపార్టీల దగ్గరవున్న డబ్బుతో వర్గాలను ముఠాలవలె తయారుచేసుకున్నారు.కావున ప్రజలారా జాతీయ సమ సమాజం పార్టి 2024 ఎన్నికల్లో పోటీ చేయ దలచి మీ ముందుకు వస్తుంది. ఈ రెండు పార్టిల దగ్గర వున్న డబ్బుతో ఓటర్లను కొని ప్రభుత్వం ఏర్పాటు చేసుకొనుటకు అరులు చాస్తున్నారు.కావున మీ పిల్లల భావిశ్యత్తు బాగు పడాలంటే రాబోయే రోజుల్లో నిరుద్యోగ సమస్య తొలగాలన్న,రైతులు పండించిన పంటకు గిట్టు బాటు ధర రావాలన్న,మంచి విద్యా అందాలన్న,మంచి వైద్యం అందాలన్న,పరిశ్రమలు రావాలన్న రాబోయే ఎన్నికల్లో జాతీయ సమ సమాజం పార్టీ ని ఎన్నుకోండి.